చిన్నారులతో మోదీ మ్యాజిక్ షో..
ABN, First Publish Date - 2023-11-17T12:24:37+05:30 IST
న్యూఢిల్లీ: ఎప్పుడూ బిబీగా గడిపే ప్రధాని మోదీ.. తనకు సమయం దొరికినప్పుడల్లా చిన్నారులతో సరదాగా కాలక్షేపం చేస్తుంటారు. రక్షాబందన్ రోజున తన కార్యాలయానికి వచ్చిన చిన్నారులతో రాఖీ కట్టించుకుని వారితో సరదాగా గడుపుతారు.
న్యూఢిల్లీ: ఎప్పుడూ బిబీగా గడిపే ప్రధాని మోదీ.. తనకు సమయం దొరికినప్పుడల్లా చిన్నారులతో సరదాగా కాలక్షేపం చేస్తుంటారు. రక్షాబందన్ రోజున తన కార్యాలయానికి వచ్చిన చిన్నారులతో రాఖీ కట్టించుకుని వారితో సరదాగా గడుపుతారు. చిన్నపిల్లలతో కలిసి తాను కూడా చిన్నపిల్లాడిగా మారిపోయి సందడి చేస్తుంటారు. తాజాగా రాంచీ వెళ్లిన మోదీ.. అక్కడ గవర్నర్ హౌస్‌కు వచ్చిన చిన్నారులతో సరదాగా గడపారు. తనను కలిసేందుకు వచ్చిన తల్లిదండ్రులతో చిన్నారులు కూడా వచ్చారు. వారిని పలుకరించిన మోదీ.. వారిని ఆటపట్టించేందుకు మ్యాజిక్ చేశారు. రూపాయి కాయిన్‌తో మోదీ చేసిన మ్యాజిక్ చిన్నారులను ఆశ్చర్యపరిచింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-11-17T12:24:38+05:30