తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్న కువైత్

ABN, First Publish Date - 2023-10-12T13:13:11+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కువైత్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణీకులను పికప్ చేసుకుంటున్న అక్రమ డ్రైవర్లను తక్షణమే దేశం నుంచి బహిష్కరించాలని నిర్ణయించింది.

ABN Digital: గల్ఫ్ దేశం కువైత్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కువైత్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణీకులను పికప్ చేసుకుంటున్న అక్రమ డ్రైవర్లను తక్షణమే దేశం నుంచి బహిష్కరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ దేశ తాత్కాలిక ప్రధాని, అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్ తలాల్ అల్ ఖలీద్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై విమానాశ్రయాల్లో తనిఖీలు కఠినతరం చేయాలని సూచించారు. విమానాశ్రయంలో క్రమం తప్పకుండా సోదాలు నిర్వహించడం, అక్రమ డ్రైవర్లను గుర్తించి అదుపులోకి తీసుకోవడంతోపాటు వెంటనే దేశం నుంచి వెళ్లగొట్టాలని ఆదేశించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-12T13:13:11+05:30