TS News: వామ్మో.. వాళ్ల ధైర్యం.. పొట్టకూటి కోసం..

ABN, First Publish Date - 2023-05-10T14:36:38+05:30 IST

కూటి కోసం కోటి విద్యలు అనే సామెత ఏ సందర్బంలో పుట్టిందో తెలియదు కానీ.. ఈ సామెత వారికి పక్కగా వర్తిస్తుంది. పూట గడిచేందుకు ప్రాణాలకు తెగించి బతుకు పోరాటం సాగిస్తున్నారు.

ABN Internet Dept.: కూటి కోసం కోటి విద్యలు అనే సామెత ఏ సందర్బంలో పుట్టిందో తెలియదు కానీ.. ఈ సామెత వారికి పక్కగా వర్తిస్తుంది. పూట గడిచేందుకు ప్రాణాలకు తెగించి బతుకు పోరాటం సాగిస్తున్నారు. వారు చేసే పనిలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. ప్రాణాలు పోతాయి. కానీ బతకాలంటే ఏదో ఒకటి చేయాలికదా.. అందుకేనేమో తేనె తుట్టెలను (Honey combs) కదిలించడమే వృత్తిగా చేసుకుని పొట్ట గడుపుకుంటున్నారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రోహిత్ అనే వ్యక్తి ప్రస్తుతం హైదరాబాద్‌ (Hyderabad)లో నివాసం ఉంటున్నాడు. అయితే చిన్ననాటి నుంచి తేనె తుట్టెలు కదిలించడంలో దిట్ట. ఈ పనిని వృత్తిగా మార్చుకుని జీవనం సాగిస్తున్నాడు. చాలా ఏళ్లుగా ఇదే పనిలో నిమగ్నమై ఉండడంతో ఎంతటి పెద్ద తేనె తుట్టెనైనా ఆలవోకగా కదిలించేస్తాడు. ఏ మాత్రం భయం లేకుండా తేనె తుట్టెల నుంచి తేనెను బయటకు తీస్తాడు. తెలంగాణ (Telangana)లోని ఉమ్మడి వరంగల్ (Warangal), కరీంనగర్ (Karimnagar) జిల్లాలతోపాటు ఇతర జిల్లాల్లో కూడా తన బృందంతో కలిసి తేనె తుట్టెలు కదిలిస్తూ ఉపాధి పొందుతున్నాడు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-05-10T14:36:38+05:30