జనరిక్ ఔషధాలు రాయకుంటే లైసెన్స్ రద్దు
ABN, First Publish Date - 2023-08-15T12:46:00+05:30 IST
ప్రస్తుత కాలంలో విద్యా, వైద్యం అనేవి చాలా ఖరీదైనవిగా మారిపోయాయనేది నిర్వివాదాంశం. ముఖ్యంగా చిన్న రోగం వచ్చి ఆస్పత్రి గడప తొక్కితే చాలు.. సామాన్యుల జేబుకు చిల్లు పడాల్సిందే. వందల నుంచి వేల రూపాయలవరకు మందుల కొనుగోళ్లకే సరిపోతాయి.
ABN Digital: ప్రస్తుత కాలంలో విద్యా, వైద్యం అనేవి చాలా ఖరీదైనవిగా మారిపోయాయనేది నిర్వివాదాంశం. ముఖ్యంగా చిన్న రోగం వచ్చి ఆస్పత్రి గడప తొక్కితే చాలు.. సామాన్యుల జేబుకు చిల్లు పడాల్సిందే. వందల నుంచి వేల రూపాయలవరకు మందుల కొనుగోళ్లకే సరిపోతాయి. దాంతో పాటు సదరు ఆస్పత్రికి సంబంధించిన మెడికల్ షాపుల్లో మాత్రమే ప్రిష్కిప్సన్‌లోని మందులు లభించేలా కొందరు డాక్టర్లు మందులను రాస్తుంటారు. దీంతో ఎంత ఖర్చు అయినా భరించి అక్కడే ఆ మందులు కొనాల్సిన పరిస్థితి. ఈ విధానంపై నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. చవకగా లభించే జనరిక్ ఔషధాలు రాయాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కొంతకాలం పాటు ప్రాక్టీస్ చేయకుండా లైసెన్సును సయితం నిలిపివేస్తామని హెచ్చరించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-15T12:46:00+05:30