కెనడాలో ఘనంగా దీపావళి సంబరాలు..

ABN, First Publish Date - 2023-11-22T14:05:28+05:30 IST

కెనడాలోని టోరంటో నగరంలో డుర్హం తెలుగు క్లబ్ (డీటీసీ) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దాదాపు 8 వందల తెలుగు కుటుంబాల సభ్యులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు.

ABN Digital: కెనడాలోని టోరంటో నగరంలో డుర్హం తెలుగు క్లబ్ (డీటీసీ) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దాదాపు 8 వందల తెలుగు కుటుంబాల సభ్యులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో చిన్నారులు అలరించారు. నగరంలో ప్రసిద్ధిగాంచిన గెట్ హోం రియాల్టీ అధినేతలు ఆనంద్ పేరిచర్ల, రమేష్ గొల్లు, రఘు జాలూరి ఈ కార్యక్రమానికి చేయూతనందించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా విత్బ్య్ నగర ఎంపీపీ లాన్ కాయ్, డిప్యూటీ మేయర్ మలీహ షాహిద్ విచ్చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-22T14:05:30+05:30