Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. చాట్ బయటపెట్టిన సుఖేష్ లాయర్లు
ABN, First Publish Date - 2023-04-12T16:24:19+05:30 IST
సుమారు రూ.200 కోట్ల మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) మరో సంచలనానికి తెరదీశారు.
సుమారు రూ.200 కోట్ల మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) మరో సంచలనానికి తెరదీశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రి సత్యేంద్రజైన్ ఆదేశాలతో హైదరాబాద్ బీఆర్‌ఎస్ ఆఫీస్‌లో రూ.15 కోట్ల డబ్బులు కారులో ముట్టజెప్పినట్టు ఇటీవలే లేఖ విడుదల చేసిన సుఖేశ్.. తాజాగా మరో బాంబ్ పేల్చాడు. డబ్బు ముట్టజెప్పే విషయమై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో వాట్సాప్ చాటింగ్ జరిగిందని పేర్కొంటూ పలు వాట్సప్ స్ర్కీన్ షాట్లను అతడు షేర్ చేశాడు. ఎమ్మెల్సీ కవితతో సుఖేశ్ చేసిన వాట్సాప్ చాట్ అంటూ వాట్సాప్ స్ర్కీన్ షాట్లను సుఖేశ్ తరపు లాయర్ విడుదల చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సుఖేశ్ చంద్రశేఖర్ నిందితుడుగా ఉన్నారు.
Updated at - 2023-04-12T16:27:21+05:30