చీరమేను చేపల కిలో ధర ఎంతంటే..

ABN, First Publish Date - 2023-10-17T12:54:59+05:30 IST

గోదావరి జిల్లా వాసులు ఎంతో ఇష్టంగా తినే చీరమేను శీతాకాలం ప్రారంభంలోనే దొరుకుతుంది. ఎక్కువగా దసరా నుంచి దీపావళి.. మహా అయితే నాగుల చవితి వరకు మాత్రమే లభ్యమవుతుంది. మొత్తం మీద ఇది బాగా దొరికేది ఏడాదికి 20 రోజులు మాత్రమే.

ABN Digital: గోదావరి జిల్లా వాసులు ఎంతో ఇష్టంగా తినే చీరమేను శీతాకాలం ప్రారంభంలోనే దొరుకుతుంది. ఎక్కువగా దసరా నుంచి దీపావళి.. మహా అయితే నాగుల చవితి వరకు మాత్రమే లభ్యమవుతుంది. మొత్తం మీద ఇది బాగా దొరికేది ఏడాదికి 20 రోజులు మాత్రమే. చల్లగా వీచే తూర్పు గాలులకు చీరమేను నీటి అడుగు భాగం నుంచి ఉపరితలం మీదకు చేరుకుంటుంది. గుంపులు గుంపులుగా వస్తున్న వాటి కోసం మత్స్యకారులు కాస్తుంటారు. వేళ్ల సందులు, వలలోంచి కూడా జారిపోయేంత చిన్నగా ఉండడంవల్లే వాటిని చీరలతో పట్టుకుంటారు. అందుకే ఈ చేపకు చీరమేను అని పేరు. చేప ప్రియులు అత్యంత ఇష్టంగా తినే చీరమేను పుదుచ్ఛేరి, యానం మార్కెట్‌లోకి వచ్చేసింది. లీటరు చీరమేనును రూ. 2,800లకు విక్రయిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-17T12:54:59+05:30