Gold: బంగారం మోసాలకు చెక్.. స్కాన్ చేస్తే చాలు..

ABN, First Publish Date - 2023-04-22T16:11:09+05:30 IST

ఓ వైపు బంగారం (Gold) ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.

ఓ వైపు బంగారం (Gold) ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అదే సమయంలో చెల్లించే సొమ్ముకు తగిన స్వచ్ఛత కలిగిన బంగారు ఆభరణాలు పొందడంలో కొనుగోలు దారులు మోసపోకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా బీఐఎస్ కేర్ యాప్ (BIS CARE APP)ను విడుదల చేసింది. వినియోగదారులు తమ మొబైల్ ఫోన్లలో యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఆభరణంపై స్కాన్ చేసి నగలపై ఉండే హెచ్‌యూఐడీ (HUID) నంబర్ అసలుదో కాదో ధృవీకరించుకోవచ్చు.

Updated at - 2023-04-22T16:27:04+05:30