ఈ రోగం వచ్చిన తొలి గంట వరకే ఛాన్స్...!
ABN, First Publish Date - 2023-07-24T13:01:52+05:30 IST
పక్షవాతం వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం తలెత్తవచ్చు. పక్షవాతం వచ్చినట్టు తెలియగానే వీలైనంత తొందరగా ఆస్పత్రికి తరలిస్తే వ్యాధిని నయం చేయడానికి వీలవుతుందని వైద్యులు చెబుతున్నారు.
ABN Internet: పక్షవాతం వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం తలెత్తవచ్చు. పక్షవాతం వచ్చినట్టు తెలియగానే వీలైనంత తొందరగా ఆస్పత్రికి తరలిస్తే వ్యాధిని నయం చేయడానికి వీలవుతుందని వైద్యులు చెబుతున్నారు. మనిషిని నిర్వీర్యం చేసే అతి పెద్ద వైపరీత్యం పక్షవాతం. ఇది ఉన్నట్టుండి మెదడులో స్ట్రోక్ కారణంగా రావచ్చు. మెదడులోని రక్తనాళాలు ఎక్కడైనా పూడుకొనిపోయినా, పగిలిపోయినా పక్షవాతం రూపంలో బయటపడుతుంది. శరీరంలోని సగ భాగం పడిపోతుంది. కాలు, చేయి, నోరు వంకరపోతుంది. మాట రాదు. జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. తొలి గంట నుంచి మూడు గంటలలోపు ఆస్పత్రికి తరలించాలి. తొలిగంటలోపు చేరితే సమస్యను సత్వరం పరిష్కరించడానికి వీలుంటుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-07-24T13:01:52+05:30