CCTV Footage: రెచ్చిపోయిన దొంగలు.. యువతి ఇంటి ముందే చైన్ స్నాచింగ్..
ABN, First Publish Date - 2023-04-26T16:58:12+05:30 IST
జల్సాలకు అలవాటు పడి ఈజీగా మనీ సంపాదించేందుకు కొందరు యువత అడ్డదారులు తొక్కుతున్నారు. దొంగలుగా మారుతున్నారు.
జల్సాలకు అలవాటు పడి ఈజీగా మనీ సంపాదించేందుకు కొందరు యువత అడ్డదారులు తొక్కుతున్నారు. దొంగలుగా మారుతున్నారు. మహిళలు ఒంటరిగా కనబడితే చాలు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో ఇద్దరు చైన్ స్నాచింగ్‌లు రెచ్చిపోయారు. యువతిని వెంబడించి ఆమె ఇంటి దగ్గరే బంగారం చైన్ లాక్కెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
లక్నోలో ఓ కాలనీకి చెందిన యువతి ఉదయం పాల కోసం దుకాణానికి వెళ్లింది. పాలు కొనుక్కొని స్కూటిపై తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆమెను ఇద్దరు దుండగులు వెంబడించారు. ఆ మె ఇంటిని చేరే వరకు పాలోఅయ్యారు. యువతి గేటు వద్ద స్కూటీ ఆపి గేటు తీసేందుకు ప్రయత్నించింది. బైక్‌పై నుంచి వచ్చిన ఇద్దరిలో ఒకరు ఆమె వద్దకు వచ్చి మెడలో ఉన్న బంగారం గొలుసును లాక్కెళ్లారు.
Updated at - 2023-04-26T16:58:22+05:30