ఎద్దుపై రైడ్‌కు వెళ్లాడు.. పోలీస్ స్టేషన్‌లో పడ్డాడు..

ABN, First Publish Date - 2023-05-11T13:54:50+05:30 IST

ఉత్తరాఖండ్: తాగితే కొందరు ఏం చేస్తారో వారికే తెలియదు. రోడ్లపై తిరుగుతుంటారు. ఇంకొందరైతే ఇతరులతో గొడవ పెట్టుకుని నానా హంగామా చేస్తారు. స్పృహలేకుండా పడిపోతారు.

ఉత్తరాఖండ్: తాగితే కొందరు ఏం చేస్తారో వారికే తెలియదు. రోడ్లపై తిరుగుతుంటారు. ఇంకొందరైతే ఇతరులతో గొడవ పెట్టుకుని నానా హంగామా చేస్తారు. స్పృహలేకుండా పడిపోతారు. ఓ వ్యక్తి కూడా ఇలాగే మద్యం మత్తులో హల్ చల్ చేశాడు. గుర్రం అనుకున్నాడో ఏమో ఎద్దుపై ఎక్కి వీధుల్లో స్వారీ చేశాడు. ఎదురుగా వచ్చినవారిపైకి దూసుకెళ్లినంతపనిచేశాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మద్యం మత్తులో తెలియకుండా ఏవేవో చేస్తారు.

ఉత్తరాఖండ్‌లోని రుషికేష్‌లో కూడా ఓ యువకుడు మద్యం సేవించి హంగామా చేశాడు. అర్ధరాత్రివేళ తాగి రోడ్డుపైకి వచ్చాడు. దగ్గరలో అతనికి ఓ ఎద్దు కనిపించింది. దానిపైకి ఎక్కాడు. దీంతో భయానికి గురైన ఎద్దు పరుగులుపెట్టింది. ఈ ఘటన చివరికి పోలీసుల దృష్టికి చేరింది. తర్వాత ఏమైందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-05-11T13:54:50+05:30