జాగ్రత్త.. ఇలా చేస్తే మీ టీవీకి ఈ ప్రమాదం తప్పదు
ABN, First Publish Date - 2023-04-25T16:39:34+05:30 IST
ప్రస్తుత కాలంలో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ టీవీ అనేది ఓ వినోద సాధనంగా మారింది. కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు.. ఇంట్లో టీవీ ముందు కూర్చొని సినిమాలు, రకరకాల షోలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాం....
ప్రస్తుత కాలంలో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ టీవీ అనేది ఓ వినోద సాధనంగా మారింది. కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు.. ఇంట్లో టీవీ ముందు కూర్చొని సినిమాలు, రకరకాల షోలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాం. కొన్నిసార్లు మన టీవీ స్క్రీన్ పై దుమ్ము, ధూళీ పెరుకుపోయి బొమ్మ సరిగ్గా కనిపించదు. అలాంటప్పుడు మన టీవీ స్క్రీన్ ను క్లీన్ చేయవసి ఉంటుంది. ఆ సమయంలో చాలా మంది టీవీ తెరను ఎలా క్లీన్ చేయాలో తెలియక రకరకాల వస్త్రాలను ఉపయోగిస్తూ కొన్ని లిక్విడ్లను స్ప్రే చేస్తుంటారు. అలా చేయడం వల్ల స్క్రీన్ పాడవుతోంది.
టీవీ స్క్రీన్ ను క్లీన్ చేయడం కోసం కొన్ని ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో అన్ని ఎల్సీడీ, ఎల్ఈడీ, ఓఎల్ఈడీ స్క్రీన్ ఉన్న స్మార్ట్ టీవీలే మార్కెట్ లో అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఈ టీవీల స్క్రీన్లు మాత్రం చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. వీటిపై కొంచెం ఒత్తిడి కలిగినా పాడయ్యే ప్రమాదం ఎక్కువ.
ఈ విషయం తెలియక చాలా మంది టవల్, ట్వీసివ్ లతో టీవీ స్క్రీన్లను తుడుస్తుంటారు. ఫలితంగా వాటిపై గీతలు పడతాయి. అందుకే స్మార్ట్ టీవీని శుభ్రం చేసేటప్పుడు తూవాళ్లకు బదులుగా.. మైక్రో పైబర్ క్లాత్ లను వినియోగించాలి. స్క్రీన్ పై పడ్డ మరకలను మైక్రో పైబర్ క్లాత్ తో తుడిస్తే పూర్తిగా తొలగిపోవడమే కాకుండా.. స్క్రీన్ పై ఎలాంటి స్క్రాచెస్ పడవు.
Updated at - 2023-04-25T16:43:04+05:30