Arrest Warrant: జగన్‌కు బిగ్ షాక్.. కొడాలి నానికి అరెస్టు వారెంట్

ABN, First Publish Date - 2023-03-03T21:48:34+05:30 IST

గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని(Gudivada YCP MLA Kodali Nani)కి అరెస్టు వారెంట్ అమలు చేయాలని పోలీసులను న్యాయస్థానం(court) ఆదేశించింది.

విజయవాడ: గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని(Gudivada YCP MLA Kodali Nani)కి అరెస్టు వారెంట్ అమలు చేయాలని పోలీసులను న్యాయస్థానం(court) ఆదేశించింది. కొడాలి నానిపై జారీ చేసిన అరెస్టు వారెంట్(arrest warrant) ఈ ఏడాది జనవరి 5 నుంచి పెండింగ్‌లో ఉంది. వాయిదాలకు కొడాలి నాని (Kodali Nani) రాకపోవడంపై విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన గవర్నర్‎పేట సీఐ సురేష్ కుమార్‎ని న్యాయమూర్తి ప్రశ్నించారు. నానిపై అరెస్టు వారెంట్ పెండింగ్‎లో ఉందని, దాన్ని వెంటనే అమలు చేయాలని సీఐని జస్టిస్ గాయత్రీదేవి (Justice Gayatri Devi) ఆదేశించింది. అప్పటి ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి ప్రయత్నించడం లేదంటూ ఆందోళనలు చేశారు. పోలీసు ఉత్తర్వులు ఉల్లంఘించి 2016 మే 10న మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే కొడాలి నాని, మరికొందరు నాయకులు ర్యాలీ చేపట్టారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారనే కారణంగా కేసు నమోదైంది. ఈ కేసులో కొడాలి నాని కోర్టుకు హాజరుకాక పోవడంతో న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది.

Updated at - 2023-03-03T21:52:50+05:30