ఇన్నేళ్లకు పూజలందుకుంటున్న అమ్మవారు..

ABN, First Publish Date - 2023-10-18T12:00:08+05:30 IST

జమ్మూకశ్మీర్: దేవీ నవరాత్రులు మొదలయ్యాయంటే చాలు.. దేశ వ్యాప్తంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. కొన్ని ప్రాంతాల్లో వాడవాడలా మండపాలు ఏర్పాటు చేసి.. 9 రోజులపాటు అమ్మవారిని కొలుస్తారు. కానీ...

జమ్మూకశ్మీర్: దేవీ నవరాత్రులు మొదలయ్యాయంటే చాలు.. దేశ వ్యాప్తంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. కొన్ని ప్రాంతాల్లో వాడవాడలా మండపాలు ఏర్పాటు చేసి.. 9 రోజులపాటు అమ్మవారిని కొలుస్తారు. కానీ మన దేశంలో ఓ ఆలయంలో మాత్రం 75 ఏళ్లుగా ఆ అమ్మవారు పూజలందుకోవడంలేదు. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్‌లో అద్బుత దృశ్యం అవిష్కృతమైంది. కుప్వారా జిల్లాలోని టీట్వాల్ గ్రామంలో పురాతన శారదామాత ఆలయం ఉంది. ఈ ఆలయంలో 1947 తర్వాత తొలిసారిగా నవరాత్రి పూజలు నిర్వహించారు. సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ దేవాలయంలో తొలిసారిగా జరిగిన పూజా కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 1947లో ఈ ఆలయంపై దాడి జరగడంతో అప్పటి నుంచి శిధిలదశలోనే ఉండిపోయింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-18T12:00:08+05:30