రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేసిన అమెరికా..

ABN, First Publish Date - 2023-09-27T12:35:53+05:30 IST

వాషింగ్టన్: విదేశాల్లో చదువుకునేవారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ముఖ్యంగా అమెరికా వెళ్లి చదువును అభ్యసించే విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. అగ్రరాజ్యం సయితం డిమాండ్‌కు తగినట్లుగా వీసాలను జారీ చేసేందుకు ప్రయత్నిస్తోంది.

వాషింగ్టన్: విదేశాల్లో చదువుకునేవారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ముఖ్యంగా అమెరికా వెళ్లి చదువును అభ్యసించే విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. అగ్రరాజ్యం సయితం డిమాండ్‌కు తగినట్లుగా వీసాలను జారీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది జూన్, జులై, ఆగస్టు నెలల్లో రికార్డు స్థాయిలో అమెరికా వీసాలు జారీ చేసింది. భారతీయ విద్యార్థుల కోసం ఈ వేసవిలో 90 వేలకుపైగా వీసాలను జారీ చేసినట్లు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. అమెరికాలో చదువుకోసం ప్రపంచ వ్యాప్తంగా జారీ చేస్తున్న ప్రతి నాలుగు విద్యార్థి వీసాల్లో ఒకటి భారత్‌దే ఉంటుందని తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-27T12:35:53+05:30