పరాకాష్టకు వైసీపీ పబ్లిసిటీ పిచ్చి..

ABN, First Publish Date - 2023-08-28T13:06:56+05:30 IST

చిత్తూరు జిల్లా: వైసీపీ పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరుకుంది. ఆఖరుకు విద్యార్థులను కూడా వదిలిపెట్టడంలేదు. నగరిలో సీఎం జగన్ కార్యక్రమానికి విద్యార్థులు వైసీపీ జెండాలు పట్టుకుని, కండువాలు, టీషర్టులు ధరించి హాజరుకావడం తీవ్ర కలకలం రేపుతోంది.

చిత్తూరు జిల్లా: వైసీపీ పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరుకుంది. ఆఖరుకు విద్యార్థులను కూడా వదిలిపెట్టడంలేదు. నగరిలో సీఎం జగన్ కార్యక్రమానికి విద్యార్థులు వైసీపీ జెండాలు పట్టుకుని, కండువాలు, టీషర్టులు ధరించి హాజరుకావడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఇలా సీఎం సభకు రావడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే సెమిస్టర్ పరీక్షలను రాయనీయకుండా వాయిదా వేసి మరీ సీఎం సభకు తరలిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులను సభకు పంపించకుంటే భవిష్యత్తులో కాలేజీ యాజమన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందని అధికారులు హెచ్చరించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-28T13:06:56+05:30