Vasantha Krishnaprasad: పోరంబోకులను వెంటేసుకుని తిరగడం చేతగాక...
ABN, First Publish Date - 2023-01-11T07:37:55+05:30 IST
సొంత సర్కారుపై వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్(YCP Mylavaram MLA Vasantha Krishnaprasad) మరోసారి అసంతృప్తి
కృష్ణా/మైలవరం: సొంత సర్కారుపై వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్(YCP Mylavaram MLA Vasantha Krishnaprasad) మరోసారి అసంతృప్తి వ్యక్తంచేశారు. పది మంది పోరంబోకులను వెంటేసుకుని తిరగడం చేతగాక పాతతరం నాయకుడిలా మిగిలిపోయానని అన్నారు. రౌడీలను వెంటేసుకుని వారిలా తిరిగితేనే రాజకీయాల్లో ముందుకెళ్లే పరిస్థితులు కనబడుతున్నాయని చెప్పారు. ఒక్కోసారి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామా, ఎమ్మెల్యే ఎందుకు అయ్యానా అని బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
Updated at - 2023-01-11T07:43:03+05:30