జగన్‌కు షాక్.. వైసీపీకి ఆ ఎంపీ గుడ్ బై..?

ABN, First Publish Date - 2023-07-21T11:04:02+05:30 IST

అమరావతి: వైసీపీలో కొనసాగలేకపోతున్న అసంతృప్తుల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి పలువురు కీలక నేతలు బయటకు వెళ్లిపోయారు

అమరావతి: వైసీపీలో కొనసాగలేకపోతున్న అసంతృప్తుల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి పలువురు కీలక నేతలు బయటకు వెళ్లిపోయారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆమంచి శ్రీనివాసులు, పంచక్ల రమేష్ బాబు ఇలా ఒక్కొక్కరిగా పార్టీకీ గుడ్‌పై చెబుతున్నారు. తాజాగా మరో వైసీపీ ఎంపీ అసంతృప్తిగా ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య కుమారుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు నరసారావుపేట నియోజకవర్గం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచారు. అయితే ఇప్పుడు పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దీంతో వచ్చే ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలోకి జంప్ అవుతారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి..

Updated at - 2023-07-21T11:04:02+05:30