టీడీపీ కార్యకర్త ఇంటిపై వైసీపీ నేతల దాడి..

ABN, First Publish Date - 2023-07-07T12:45:27+05:30 IST

పల్నాడు జిల్లా: పెదకొరపాడు నియోజవర్గం, అమరావతి మండలం, ధరణికోటలో టీడీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న సంజయ్ అనే కార్యకర్త ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారు.

పల్నాడు జిల్లా: పెదకొరపాడు నియోజవర్గం, అమరావతి మండలం, ధరణికోటలో టీడీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న సంజయ్ అనే కార్యకర్త ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న సంజయ్ ఇంటిపైకి దాడికి వెళ్ళిన నేతలు.. ఆయన భార్య శ్రీదేవిపై దుర్భాషలాడుతూ, అసభ్యంగా ప్రవర్తిస్తూ దాడికి దిగారు. దాడి దృశ్యాలు చిత్రీకరిస్తున్న శ్రీదేవి చేతిలో సెల్ ఫోన్ లాక్కొని కొట్టబోయారు. ఆమె కేకలు వేయడంతో అక్కడినుంచి పరారయ్యారు. ఈ ఘటనపై శ్రీదేవి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-07T12:45:27+05:30