టీడీపీ శ్రేణులపై వైసీపీ నేతల దాడి..
ABN, First Publish Date - 2023-06-27T11:02:35+05:30 IST
నెల్లూరు: గత ఎన్నికలకు ముందు జగన్ మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చేశారు. వైసీపీ నేతలంతా అదే పంథాను కొనసాగిస్తున్నారు.
నెల్లూరు: గత ఎన్నికలకు ముందు జగన్ మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చేశారు. వైసీపీ నేతలంతా అదే పంథాను కొనసాగిస్తున్నారు. అధినేతకు తగ్గట్టుగా చోటా నేతలు కూడా బెల్టు షాపులతో అందినకాడికి దోచుకుంటున్నారు. అయితే టీడీపీ నేతలు వారిని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మద్యం, బెల్టు షాపులు ఆపాలన్నందుకు టీడీపీ సానుభూతి పరులపై వైసీపీ నేతలు దాడి చేశారు. కళ్లల్లో కారం చల్లి.. కత్తులు, రాడ్లతో దాడి చేశారు. నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలో గంగయ్యగారిపాలెంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-06-27T11:02:35+05:30