పోలీస్ స్టేషన్‌కు తాళం వేసిన మహిళ

ABN, First Publish Date - 2023-10-18T10:24:33+05:30 IST

పెందుర్తి: ఓ ఇంటికి సంబంధిచిన వివాదం నేపథ్యంలో ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో ఓ మహిళ ఏకంగా పోలీస్ స్టేషన్‌కు తాళం వేసింది. విశాఖ జిల్లా, పెందుర్తి పట్టణంలో గౌతమి పార్వతీ అనే మహిళ రూ. 12 లక్షలకు ఓ ఇంటిని కొనుగోలు చేసి..

పెందుర్తి: ఓ ఇంటికి సంబంధిచిన వివాదం నేపథ్యంలో ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో ఓ మహిళ ఏకంగా పోలీస్ స్టేషన్‌కు తాళం వేసింది. విశాఖ జిల్లా, పెందుర్తి పట్టణంలో గౌతమి పార్వతీ అనే మహిళ రూ. 12 లక్షలకు ఓ ఇంటిని కొనుగోలు చేసి ఆరు నెలల క్రితం అడ్వాన్స్‌గా రూ. 5 లక్షలు చెల్లించింది. అయితే ఇప్పుడు ఇల్లు అమ్మడంలేదని, ఇళ్లు ఖాళీ చేయాలని యజమాని ఒత్తిడి తెస్తున్నాడు. అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని ఆమె అడిగినా పట్టించుకోకుండా ఇంట్లో వస్తువులు రోడ్డుపై పడేసారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు పట్టించుకోకపోవడంతో ఆమె పీఎస్ గేటుకు తాళం వేసి నిరసన తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-18T10:24:33+05:30