కొత్త పీఆర్సీ ఏమైంది?

ABN, First Publish Date - 2023-07-13T11:48:04+05:30 IST

హైదరాబాద్: వేతన సవరణ సంఘం ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం నోరు విప్పడంలేదు. గడువు దాటిపోయినా ఉలుకూ.. పలుకూ లేదు. ఎన్నికల ముందు వరాల జల్లు కురిపిస్తుందని అనుకుంటే చిన్న చిన్ననిర్ణయాలతోనే సరిపెడుతోందని..

హైదరాబాద్: వేతన సవరణ సంఘం ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం నోరు విప్పడంలేదు. గడువు దాటిపోయినా ఉలుకూ.. పలుకూ లేదు. ఎన్నికల ముందు వరాల జల్లు కురిపిస్తుందని అనుకుంటే చిన్న చిన్ననిర్ణయాలతోనే సరిపెడుతోందని, పీఆర్సీ మాటెత్తడంలేదని ఉద్యోగులు వాపోతున్నారు. తెలంగాణ మొదటి పీఆర్సీ గడువు ఈ ఏడాది జూన్ 30 నాటికే ముగిసింది. ఈ ఏడాది జులై ఒకటో తేదీ నుంచే రెండో పీఆర్సీ వేతనాలు అమల్లోకి రావాలి. అలా జరగాలంటే ముందస్తుగానే పీఆర్సీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ జులై 12వ తేదీ గడిచిపోయినా పీఆర్సీపై ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల్లో చలనం లేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-13T11:48:04+05:30