విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం..

ABN, First Publish Date - 2023-10-30T10:13:21+05:30 IST

విజయనగరం జిల్లా: కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఘోరాన్ని మరచిపోకముందే... మరో రైలు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ప్యాసింజర్‌ను... అదే పట్టాలపై వచ్చిన మరో ప్యాసింజర్‌ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది.

విజయనగరం జిల్లా: కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఘోరాన్ని మరచిపోకముందే... మరో రైలు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ప్యాసింజర్‌ను... అదే పట్టాలపై వచ్చిన మరో ప్యాసింజర్‌ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. విజయనగరం జిల్లా అలమండ- కంటకాపల్లి స్టేషన్ల మధ్య జరిగిన ఈ దుర్ఘటనలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. 60 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. తొలుత ఆరుతో మొదలైన మృతుల సంఖ్య... సమయం గడిచేకొద్దీ పెరుగుతూ పోయింది. సంఘటన స్థలం వద్ద నెలకొన్న పరిస్థితులు, క్షతగాత్రుల సంఖ్యను చూస్తే... మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-30T10:15:33+05:30