హైదరాబాద్: ట్రాఫిక్ కష్టాలు..

ABN, First Publish Date - 2023-09-05T12:54:25+05:30 IST

హైదరాబాద్: నగరంలో వాన కుమ్మేస్తోంది. దీంతో రోడ్లు జలమయం కాగా పలు రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. ఒక్కసారిగా కుమ్మరించిన వర్షంతో ఎండిపోయిన రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి.

హైదరాబాద్: నగరంలో వాన కుమ్మేస్తోంది. దీంతో రోడ్లు జలమయం కాగా పలు రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. ఒక్కసారిగా కుమ్మరించిన వర్షంతో ఎండిపోయిన రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి. జీహెచ్ఎంసీ అధికారులు ముందుగా హెచ్చరికలు జారీ చేయకపోవడంతో నగర వాసులు కష్టాల్లో చిక్కుకున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. మూడు రోజులుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికి కూడా ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు స్పందించలేదు. మంత్రి సబిత మంగళవారం ఉదయం స్కూళ్లకు సెలవులు ప్రకటించడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. పూర్తి సమాచారం కోసం ఈ వీడియోక్లిక్ చేయండి.

Updated at - 2023-09-05T12:54:25+05:30