వైసీపీ ప్రభుత్వంలో కూలీలకు దొంగ మస్టర్లు..

ABN, First Publish Date - 2023-06-28T12:22:11+05:30 IST

అమరావతి: రాష్ట్రంలో ఉపాధిహామీ పథకం అమలుతీరు నానాటికి తీసికట్టు చందంగా మారింది. ఒకప్పుడు ఈ పథకం అమలులో దేశంలోనే ముందున్న ఏపీలో ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.

అమరావతి: రాష్ట్రంలో ఉపాధిహామీ పథకం అమలుతీరు నానాటికి తీసికట్టు చందంగా మారింది. ఒకప్పుడు ఈ పథకం అమలులో దేశంలోనే ముందున్న ఏపీలో ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. దొంగ మస్టర్లు, తప్పుడు నివేదికలతో కేంద్రం వద్ద రాష్ట్ర ఉపాధిహామీ పథకం విభాగానికి ఉన్న ప్రతిష్ట పూర్తిగా మసగబారింది. దేశంలో మొట్టమొదటిగా ఈ పథకాన్ని రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. నాటి నుంచి గత టీడీపీ ప్రభుత్వ హయాం వరకు ఈ పథకం అమలులో ఏపీ ఉనికిని ఘనంగా చాటుకుంది. ఒకటి, రెండు ఎకరాలు ఉన్న పేద రైతులు ఈ పథకాన్ని ఎంత విస్తృతంగా వినియోగించుకోవచ్చో చంద్రబాబు ప్రభుత్వం చేసి చూపించింది. అయితే ఇప్పుడు ఉపాధిహామీ పథకం అర్థమే మారిపోయింది. కూలీలకు దొంగ మస్టర్లు వేసి వైసీపీ స్థానిక నేతలు దోపిడీకి తెరతీశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-06-28T12:22:11+05:30