CM Jagan: జగన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న 10 లక్షల ఉద్యోగుల కుటుంబాలు..

ABN, First Publish Date - 2023-05-09T10:47:13+05:30 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జీతాలు ఇవ్వని దుస్థితి ఇంకా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి మాట్లాడితే ప్రజల కోసం అంతా చేస్తున్నామని అంటారు కానీ..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జీతాలు ఇవ్వని దుస్థితి ఇంకా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి మాట్లాడితే ప్రజల కోసం అంతా చేస్తున్నామని అంటారు కానీ.. ఆ ప్రజలకు చేయడానికి వారితో ఉన్న టీమ్.. ఉద్యోగస్తులకు వేతనాలు ఇవ్వడంలో మాత్రం నాలుగేళ్లు గడిచినా చిన్నచూపు కొనసాగుతోంది. మంగళవారం 9వ తేదీ అయినా 50 శాతం వరకు ఉద్యోగులకు జీతాలు పడలేదు... ఈ సందర్భంగా ఏబీన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన డిబేట్‌లో విశ్లేషకులు డివి శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం జగన్ ప్రసంగాల్లో ‘మీ బిడ్డను ఆశీర్వదించండి.. మీ చల్లని దీవెనలు కావాలి’ అంటారు. ముఖ్యమంత్రి కూడా ఉద్యోగుల బిడ్డేనని.. ఉద్యోగులు కూడా ఆయనను బిడ్డగానే చూస్తారన్నారు. అంటే వాళ్ల ఆశీస్సులు సీఎంకు అవసరం లేదా? అని ప్రశ్నించారు. సకాలంలో జీతాలు లేకపోవడంతో ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాళ్లపై ఆధారపడిన వృద్ధులు, ఆస్పత్రి ఖర్చులు ఉంటాయని, 9వ తేదీ అయినా జీతాలు రాకపోతే వాళ్ల పరిస్థితి ఏంటన్నారు. ఇలా అవటానికి కారణం ఏంటంటే.. ఉద్యోగ సంఘాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత బలహీనపడలేదన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కరుకుతనం కారణమా? లేక ఉద్యోగ సంఘాల బలహీనత కారణమా? వెరసి 10 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని శ్రీనివాస్ అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

Updated at - 2023-05-09T10:47:13+05:30