వర్షాలతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం
ABN, First Publish Date - 2023-07-20T10:43:20+05:30 IST
హైదరాబాద్: తెలంగాణలో గత రెండు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రెండు రోజులు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణలో గత రెండు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రెండు రోజులు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించినట్లు మంత్రి సబిత ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. అయితే కొన్ని పాఠశాలలు ఉదయాన్నే ప్రారంభమవుతుండటంతో సబిత ప్రకటన వచ్చే వరకూ కాస్త ఆలస్యం అయింది. దీంతో కొన్ని స్కూళ్లకు చెందిన పిల్లలు పాఠశాలలకు వెళ్లిపోయారు. వర్షాల విషయంలో ప్రభుత్వానికి ముందు జాగ్రత్తలు లేవని తల్లిదండ్రులు సైతం విమర్శలు చేస్తున్నారు.
Updated at - 2023-07-20T10:43:20+05:30