టీడీపీ నేత ధూళిపాళ్ల అరెస్టు..

ABN, First Publish Date - 2023-09-26T11:02:31+05:30 IST

గుంటూరు జిల్లా: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్టు చేశారు. పొన్నూరు మండలం, చింతలపూడిలోని ఆయన నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు.

గుంటూరు జిల్లా: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్టు చేశారు. పొన్నూరు మండలం, చింతలపూడిలోని ఆయన నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. స్కీల్ డెవలప్‌మెంట్ కేంద్రాల పరిశీలనకు వెళ్తున్న దూళిపాళ్లను అడ్డుకుని బలవంతంగా అరెస్టు చేశారు. దీంతో పోలీసుల వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దూళిపాళ్లను పొన్నూరు పోలీసు స్టేషన్‌కు తరలించడంతో టీడీపీ శ్రేణులు ఆ పీఎస్ వద్దకు వెళుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-26T11:02:31+05:30