జగన్‌కు దమ్ముంటే ఏపీలో ఉండు: టీడీపీ

ABN, First Publish Date - 2023-09-11T11:16:51+05:30 IST

రాజమండ్రి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో తెలుగుదేశం పార్టీ సోమవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది.

రాజమండ్రి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో తెలుగుదేశం పార్టీ సోమవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ సందర్బంగా సోమవారం టీడీపీ నేతలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందన్నారు. జగన్ రెడ్డి కక్ష సాధింపుకోసం తమ నాయకుడు చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టి అన్యాయంగా అరెస్టు చేయించారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధ వాతావరణాన్ని తీసుకువచ్చారని, సీఎం లండన్‌లో దాక్కున్నారని, దమ్ముంటే ఏపీలో ఉండాలని, ప్రజలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-11T12:44:13+05:30