ఒక్కసారిగా సొమ్మసిల్లి కింద పడిపోయిన తారకరత్న
ABN, First Publish Date - 2023-01-28T07:54:37+05:30 IST
సినీనటుడు నందమూరి తారకరత్న(Actor Nandamuri Tarakaratna) అస్వస్థతకు గురయ్యారు.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(TDP National General Secretary
అమరావతి/కుప్పం: సినీనటుడు నందమూరి తారకరత్న(Actor Nandamuri Tarakaratna) అస్వస్థతకు గురయ్యారు.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(TDP National General Secretary Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చారు. కుప్పం పట్టణం లక్ష్మీపురంలోని మసీదులో శుక్రవారం జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో లోకేశ్, నందమూరి బాలకృష్ణ, తారకరత్న పాల్గొన్నారు. మిగిలినవారి కంటే కాస్త ముందుగానే తారకరత్న మసీదు నుంచి బయటికి వచ్చేశారు. మసీదు బయట కాస్త దూరంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే యువగళం బృందంలోని వలంటీర్లు ఆయన్ను కారులో హుటాహుటిన కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పట్టణంలోని పీఈఎస్ మెడికల్ కాలేజీకి తరలించారు. నందమూరి బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పీఈఎస్కు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. తొలుత బెంగళూరులోని నారాయణ హృదయాలయకు ఎయిర్ అంబులెన్సులో తరలిద్దామని ప్రయత్నించినా, అది దక్షిణాదిన ఎక్కడా అందుబాటులో లేదు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి, పీఈఎస్ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న భార్య కూడా బాలకృష్ణకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు.
Updated at - 2023-01-28T07:54:37+05:30