ఈడీ కస్టడీకి తమిళనాడు మంత్రి..
ABN, First Publish Date - 2023-06-17T09:42:08+05:30 IST
చెన్నై: మనీల్యాండరింగ్ కేసులో అరస్టయి ప్రస్తుతం కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీను 8 రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి అప్పగిస్తూ చెన్నై కోర్టు ఆదేశాలిచ్చింది.
చెన్నై: మనీల్యాండరింగ్ కేసులో అరస్టయి ప్రస్తుతం కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీను 8 రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి అప్పగిస్తూ చెన్నై కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నెల 23న తిరిగి తమ ముందు హాజరుపరచాలని ఈడీకి స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు సెంథిల్ బాలాజీని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కావేరి ఆస్పత్రిలో చేర్చిన నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయనను ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ముందు హాజరుపరిచారు. బాలాజీ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన అనంతరం ఆయన కస్టడీపై న్యాయమూర్తి ఈ మేరకు ఆదేశాలిచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated at - 2023-06-17T09:42:08+05:30