సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురు..

ABN, First Publish Date - 2023-05-22T12:19:10+05:30 IST

న్యూఢిల్లీ: వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. మరోసారి ముందస్తు బెయిల్ కోసం ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

న్యూఢిల్లీ: వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. మరోసారి ముందస్తు బెయిల్ కోసం ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వెకేష‌న్ బెంచ్ ముందు పిటిషన్ మెన్షన్ చేశారు. హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు తన పిటిషన్ వినేలా ఆదేశించాలని, అవసరమైతే బెయిల్ ఇవ్వాలని కోరనున్నారు. ఒకవేళ బెయిల్ ఇవ్వని పక్షంలో హైకోర్టుకు వెళ్లి వెకేషన్ బెంచ్ ముందు తాము ప్రస్తావించే వరకు సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరనున్నారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. సుప్రీం కోర్టును అడ్డంపెట్టుకుని ఇవాళ సీబీఐ విచారణ, అరెస్టు నుంచి తప్పించుకోవాలని భావించిన అవినాష్‌కు నిరాశ ఎదురైంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-05-22T12:20:03+05:30