బాపట్ల జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ..?

ABN, First Publish Date - 2023-06-08T10:30:01+05:30 IST

గుంటూరు: ఎన్నికల ముందు బాపట్ల జిల్లా వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ప్రస్తుత పరుచూరు వైసీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జనసేన పార్టీలో చేరనున్నారు.

గుంటూరు: ఎన్నికల ముందు బాపట్ల జిల్లా వైసీపీ (YCP)కి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ప్రస్తుత పరుచూరు వైసీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ (Amanchi Krishnamohan) సోదరుడు ఆమంచి స్వాములు (Amanchi Swamulu) జనసేన (Janasena) పార్టీలో చేరనున్నారు. ఈ నెల 12వ తేదీన స్వాములు జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)తోపాటు నాగబాబు (Nagababu), నాదేండ్ల మనోహర్‌ (Nadendla Manohar)తో స్వాములు చర్చలు జరిపారు. కొద్ది రోజులుగా స్వాములు జనసేనలో చేరుతున్నారంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-08T10:30:01+05:30