టీడీపీ నిరసనల హోరుతో ప్రభుత్వానికి సెగ

ABN, First Publish Date - 2023-09-28T10:03:45+05:30 IST

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు అనంతరం జరుగుతున్న నిరసనల హోరుతో ప్రభుత్వానికి సెగ ప్రారంభమైంది. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ అంతర్గతంగా తీవ్ర ఆందోళనలు చెందుతున్నారు.

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు అనంతరం జరుగుతున్న నిరసనల హోరుతో ప్రభుత్వానికి సెగ ప్రారంభమైంది. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ అంతర్గతంగా తీవ్ర ఆందోళనలు చెందుతున్నారు. మరోవైపు లోకేష్‌ను అరెస్టు చేస్తే బ్రహ్మణి రోడ్లపైకి వస్తే ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత పెరుగుతుందనే ఆందోళన వైసీపీ నేతలను పట్టి పీడిస్తోంది. బాబు అరెస్టుకు నిరసనగా తెలంగాణ, కర్నాటక, తమిళనాడుతోపాటు పలుదేశాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చివరికి తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా అక్కడ జరుగుతున్న ఆందోళనలపై స్పందించాల్సి వచ్చిందంటే చంద్రబాబు అరెస్టు ప్రభావం ఎంతవరకు వెళ్లిందో తెలిసిపోతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-28T10:03:45+05:30