శారదా పీఠాధిపతికి సర్కారు నజరానా..
ABN, First Publish Date - 2023-08-25T08:17:49+05:30 IST
విశాఖ: నగరంలో శారదా పీఠానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద బహుమతినే ఇచ్చింది. వేద పాఠశాల ఏర్పాటుకు భూమి కావాలని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కోరారు. ఆయన కోరికను మన్నించిన ప్రభుత్వం..
విశాఖ: నగరంలో శారదా పీఠానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద బహుమతినే ఇచ్చింది. వేద పాఠశాల ఏర్పాటుకు భూమి కావాలని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కోరారు. ఆయన కోరికను మన్నించిన ప్రభుత్వం ఎకరా రూ.3 కోట్ల వరకూ పలుకుతున్న భూమిని రూ.3.5 లక్షల చొప్పున 15 ఎకరాలను కేటాయించింది. విశాఖపట్నం నుంచి భోగాపురానికి కేంద్ర నిధులతో తీరం వెంబడి నిర్మించనున్న కోస్టల్ కారిడార్‌ను ఆనుకొని ఉన్న కొండపై (భీమునిపట్నం మండలం కొత్తవలసలో సర్వే నంబర్లు 102, 103) ఈ 15 ఎకరాలు ఉంది. బీచ్‌కు సమీపాన ఉన్న ఈ కొండపై గత ఏడాది చివర్లో భూమిని కేటాయించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated at - 2023-08-25T08:20:46+05:30