పెరుగుతున్న గోదావరి వరద ప్రవాహం..

ABN, First Publish Date - 2023-07-21T12:11:27+05:30 IST

తూ.గో.జిల్లా: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర క్రమంగా గోదావరి ప్రవాహం పెరుగుతోంది. కాటన్ బ్యారేజ్ దగ్గర 11.10 అడుగులకు నీటిమట్టం చేరింది. దీంతో బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి 9 లక్షల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు.

తూ.గో.జిల్లా: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర క్రమంగా గోదావరి ప్రవాహం పెరుగుతోంది. కాటన్ బ్యారేజ్ దగ్గర 11.10 అడుగులకు నీటిమట్టం చేరింది. దీంతో బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి 9 లక్షల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. గత రెండు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో వరద నీరు గోదావరిలో చేరుతోంది. దీంతో శుక్రవారం సాయంత్రానికి 1వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముంది. విలీన మండలాల్లో భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి..

Updated at - 2023-07-21T17:51:13+05:30