రేవంత్ రెడ్డి ప్రజాకర్షక నేత

ABN, First Publish Date - 2023-12-04T10:21:18+05:30 IST

హైదరాబాద్: సీఎల్పీ సమావేశానికి గెలిచిన ఎమ్మెల్యేలందరూ గచ్చిబౌలిలోని ఎల్ల హోటల్‌కు చేరుకున్నారు. సీఎం విషయంలో అధిష్టానమే తుది నిర్ణయయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు.

హైదరాబాద్: సీఎల్పీ సమావేశానికి గెలిచిన ఎమ్మెల్యేలందరూ గచ్చిబౌలిలోని ఎల్ల హోటల్‌కు చేరుకున్నారు. సీఎం విషయంలో అధిష్టానమే తుది నిర్ణయయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. సీఎం అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే కనుక హైకమాండ్ చర్చలు జరపనుంది. అన్నీ కుదిరితే ఈరోజు సీఎం, డిప్యూటీ సీఎం ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తుంది. రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటే బాగుంటుందన్న మెజారిటీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. రేవంత్‌కు 50 మందికిపైగా మద్దతు ఉన్నట్లు సమాచారం. ఎన్నిక ప్రచారంలో భాగంగా 88 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రజాకర్షక నేతగా రేవంత్‌కు మంచి పేరుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-12-04T10:23:17+05:30