హైదరాబాద్: పలు ప్రాంతాల్లో వర్షం..
ABN, First Publish Date - 2023-09-06T10:39:12+05:30 IST
హైదరాబాద్: నగరంలో మళ్లీ వర్షం మొదలైంది. కూకట్‌పల్లి, కేబీహెచ్‌బీ, నిజాంపేట్, ప్రగతినగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మరోవైపు హైటెక్ సిటీ మాదాపూర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది.
హైదరాబాద్: నగరంలో మళ్లీ వర్షం మొదలైంది. కూకట్‌పల్లి, కేబీహెచ్‌బీ, నిజాంపేట్, ప్రగతినగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మరోవైపు హైటెక్ సిటీ మాదాపూర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. జేఎన్‌టీయూ, హైటెక్ సిటీ, రాయదుర్గం, ఖాజాగూడ, గచ్చిబౌలీ, కొండాపూర్‌కు వెళ్లే మార్గంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. విద్యార్ధులు స్కూలుకు, ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ అయింది.
మరోవైపు మూసరాంబాగ్ బ్రిడ్జి రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. మూసీ వరద ఉధృతి పెరుగుతుండటంతో గత రాత్రి నుంచి రాకపోకలు నిలిపివేయడం జరిగింది. బ్రిడ్జిని తాకుతూ వరద ఉధృతి కొనసాగుతోంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లకు భారీగా వరద పెరగడంతో నీటిని అధికారులు మూసీ నదిలోకి వదిలివేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-06T10:39:12+05:30