ములుగు జిల్లా నుంచి రాహుల్ బస్సు యాత్ర

ABN, First Publish Date - 2023-10-18T10:44:21+05:30 IST

ములుగు: తెలంగాణ ములుగు జిల్లాకు బుధవారం ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రానున్నారు. ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. మూడు దశల్లో యాత్ర కొనసాగనుంది.

ములుగు: తెలంగాణ ములుగు జిల్లాకు బుధవారం ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రానున్నారు. ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. మూడు దశల్లో యాత్ర కొనసాగనుంది. ముందుగా రామప్ప ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం బస్సు యాత్ర ప్రారంభిస్తారు. తర్వాత భూపాలపల్లిలో మహిళలతో రాహుల్, ప్రియాంక మాట్లాడతారు. రేపు (గురువారం) ఉమ్మడి కరీంనగర్, ఎల్లుండి (శుక్రవారం) నిజామాబాద్ జిల్లాలో బస్సు యాత్ర కొనసాగుతుంది. రాహుల్, ప్రియాంక సభకు ములుగు ఎమ్మెల్యే సీతక్క ఏర్పాట్లు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-18T10:44:21+05:30