జగన్ ప్రభుత్వం అప్పులపై పురందేశ్వరి ఫిర్యాదు

ABN, First Publish Date - 2023-07-28T11:03:11+05:30 IST

అమరావతి: జగన్ ప్రభుత్వం అందితే అప్పులు తీసుకువస్తోంది.. నెల చివరి తేదీ వచ్చేసరికి అప్పుల కోసం వెంపర్లాడుతోంది. నిధులను మళ్లించి వేరే అవసరాలకు వాడుకుంటోంది.

అమరావతి: జగన్ ప్రభుత్వం అందితే అప్పులు తీసుకువస్తోంది.. నెల చివరి తేదీ వచ్చేసరికి అప్పుల కోసం వెంపర్లాడుతోంది. నిధులను మళ్లించి వేరే అవసరాలకు వాడుకుంటోంది. దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్‌కు ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వం మళ్లీ అప్పుల కోసం పరుగులు తీస్తోంది. ఎఫ్ఆర్బీఎం కింద 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ఇచ్చిన రూ. 30,500 కోట్ల రుణపరిమితి పూర్తి కావడంతో ఏపీకి మళ్లీ అప్పు తెచ్చుకునేందుకు కేంద్రం వద్ద జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఇప్పటి వరకు ఫలించలేదు. దీంతో వచ్చే నెలలో ఉద్యోగుల జీతాలు, ఫెన్ష్‌లు ఇచ్చేందుకు అప్పుల కోసం వేట ప్రారంభించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-28T11:03:11+05:30