హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి
ABN, First Publish Date - 2023-07-04T11:19:00+05:30 IST
హైదరాబాద్: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకలు ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు.
హైదరాబాద్: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా హకీంపేట్ ఎయిర్ పోర్టులో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, మంత్రులు, నగర మేయర్, డీజీపీ, ముఖ్య అధికారులు రాష్ట్రపతికి శాలువ కప్పి, పుష్పగుచ్చములిచ్చి ఘనంగా స్వాగతం పలికారు. కాగా అల్లూరి జయంతి ముగింపు వేడుకలు గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇవాళ సాయంత్రం అల్లూరి స్మృతివనంను రాష్టప్రతి ద్రౌపది ముర్ము వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
Updated at - 2023-07-04T11:20:03+05:30