విద్యుత్ సబ్ స్టేషన్‌ల వద్ద గ్రామస్తుల నిరసన
ABN, First Publish Date - 2023-08-10T12:02:54+05:30 IST
తూర్పుగోదావరి జిల్లా: గోపాలపురం నియోజకవర్గం పరిధిలోని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం మండలాల పరిధిలో ఉన్న సబ్ స్టేషన్‌ల వద్ద నిరసన చేపట్టారు.
తూర్పుగోదావరి జిల్లా: గోపాలపురం నియోజకవర్గం పరిధిలోని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం మండలాల పరిధిలో ఉన్న సబ్ స్టేషన్‌ల వద్ద నిరసన చేపట్టారు. గ్రామాల్లో విద్యుత్ కోతలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలపై తమకు సరైన సమాచారం ఇచ్చే అధికారులు లేరని మండిపడుతున్నారు. వేసవిని తలపించే విధంగా ఉక్కపోతలతో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-10T12:02:54+05:30