Ponguleti Srinivas Reddy: కన్నతల్లికి అన్నం పెట్టనోడు.. తెలంగాణకి ఏం పెడ్తాడు
ABN, First Publish Date - 2023-05-06T19:05:51+05:30 IST
ఖమ్మం కలేక్టరేట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రైతు భరోసా ర్యాలీతో రావడంతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.
ఖమ్మం కలేక్టరేట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రైతు భరోసా ర్యాలీతో రావడంతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. అమ్మకే అన్నం పెట్టని కేసీఆర్.. పినతల్లికి బంగారు గాజులు కొనిస్తానంటే తెలంగాణ బిడ్డలు ఎవరూ కూడా నమ్మే పరిస్థితిలో లేరని విమర్శించారు. మాయమాటలు చెప్పి.. మాయలగారడీతో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను సుమారు రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారని కేసీఆర్‌పై పొంగులేటి ఆరోపణలు చేశారు.
Updated at - 2023-05-06T19:09:15+05:30