పొంగులేటి కీలక వ్యాఖ్యలు..

ABN, First Publish Date - 2023-06-09T12:47:40+05:30 IST

ఖమ్మం: బీఆర్ఎస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పుపై రెండు, మూడు రోజుల్లో తన నిర్ణయం హైదరాబాద్‌లో ప్రకటిస్తానని చెప్పారు.

ఖమ్మం: బీఆర్ఎస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పుపై రెండు, మూడు రోజుల్లో తన నిర్ణయం హైదరాబాద్‌లో ప్రకటిస్తానని చెప్పారు. ఖమ్మంలో కార్యకర్తల సమక్షంలోనే కొత్తపార్టీ (New Party)లో చేరతానంటూ పొంగులేటి స్పష్టం చేశారు. ‘నా అభిమానుల నిర్ణయమే.. నా నిర్ణయమని’ ఆయన స్పష్టం చేశారు. ఏ నిర్ణయం తీసుకుంటే సీఎం కేసీఆర్ (CM KCR), ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తుందో విశ్లేషించడం జరిగిందన్నారు. అందరి అభిప్రాయాలు సేకరించడానికి చాలా సమయం పట్టిందని పొంగులేటి అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-06-09T12:47:40+05:30