బీఆర్ఎస్ పార్టీకి భూములు కేటాయించడంపై హైకోర్టులో పిటిషన్

ABN, First Publish Date - 2023-07-11T12:26:50+05:30 IST

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్‌లో భూములు కేటాయించడంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. అత్యంత విలువైన భూములు ఎలా కేటాయిస్తారని పిల్ వేశారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్‌లో భూములు కేటాయించడంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. అత్యంత విలువైన భూములు ఎలా కేటాయిస్తారని పిల్ వేశారు. హైదరాబాద్‌లో ఇప్పటికే పార్టీ కార్యాలయం ఉన్నప్పటికీ 11 ఎకరాల భూములను మళ్లీ కేటాయించడం అక్రమమంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. గండిపేట మండలం, కోకాపేట గ్రామంలో 239, 240 సర్వే నెంబర్‌లో ఎకరా రూ. 50 కోట్లు విలువ చేసే.. 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వం కేటాయించింది. దీనిపై హైకోర్టులో పిల్ వేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-11T12:26:50+05:30