జగన్ పర్యటనలో జనం అవస్థలు..

ABN, First Publish Date - 2023-08-28T11:44:04+05:30 IST

చిత్తూరు జిల్లా: సీఎం జగన్ సోమవారం నగరిలో పర్యటన సందర్భంగా పుత్తూరు-నగరి మార్గంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. సభకు వచ్చే జనాలకోసం మజ్జిక ప్యాకెట్లు తీసుకువస్తున్న లారీ సభ వేదిక ముందు బురద మట్టిలో దిగబడింది.

చిత్తూరు జిల్లా: సీఎం జగన్ సోమవారం నగరిలో పర్యటన సందర్భంగా పుత్తూరు-నగరి మార్గంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. సభకు వచ్చే జనాలకోసం మజ్జిక ప్యాకెట్లు తీసుకువస్తున్న లారీ సభ వేదిక ముందు బురద మట్టిలో దిగబడింది. దీంతో పోలీసులు ఆ లారీని జేసీబీ సాయంతో ముందుకు కదిలించారు. అటు నగరి పట్టణం మొత్తం పోలీసులు గుప్పెట్లోకి వెళ్లింది. ఆంక్షల పేరుతో పోలీసులు విధించిన నిబంధనలతో సామాన్య ప్రజలు సయితం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-28T11:44:04+05:30