జగన్ ప్రభుత్వం తీరుపై జనాగ్రహం..
ABN, First Publish Date - 2023-10-06T12:11:39+05:30 IST
అమరావతి: తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రజలు, ఎన్నారైలు, చంద్రబాబు అభిమానులు సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి: తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రజలు, ఎన్నారైలు, చంద్రబాబు అభిమానులు సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘బాబుతో నేను.. సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు రోజు రోజుకు ఉదృతమవుతున్నాయి. ఏ తప్పు చేయని తమ నేతను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో గత 25వ తేదీ నుంచి నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-10-06T12:11:39+05:30