బీర్ల కోసం జనం పరుగులు...
ABN, First Publish Date - 2023-06-06T10:38:05+05:30 IST
అనకాపల్లి: జిల్లాలో బీర్ల కోసం జనం పరుగులు తీశారు. కశింకోట రోడ్డులో బయ్యవరం జాతీయ రహదారిపై బీరు బాటిల్స్ లోడుతో వెళుతున్న వ్యాన్ బోల్తా పడింది.
అనకాపల్లి: జిల్లాలో బీర్ల కోసం జనం పరుగులు తీశారు. కశింకోట రోడ్డులో బయ్యవరం జాతీయ రహదారిపై బీరు బాటిల్స్ (Beer Bottles) లోడుతో వెళుతున్న వ్యాన్ బోల్తా పడింది. అనకాపల్లి డిపో (Anakapalli Depot) నుంచి నర్సిపట్నం డిపోకు (Narsipatnam Depot) వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో రెండు వందల కేసుల బీరు సీసాలు నేలపాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు, అటుగా వెళుతున్న ప్రయాణీకులు,, వాహనాలు ఆపి బీరు బాటిల్స్‌ను తీసుకునేందుకు ఎగబడ్డారు. సంఘటన ప్రదేశానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-06-06T10:38:41+05:30