పరిటాల సునీత దీక్ష భగ్నం..
ABN, First Publish Date - 2023-09-26T11:19:23+05:30 IST
అనంతపురం: చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి పరిటాల సునీత చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతపురం రూరల్ మండలంలోని పాపంపేట దీక్ష శిబిరం వద్దకు వెళ్లిన పోలీసులు బలవంతంగా పరిటాల సునీతను అదుపులోకి తీసుకున్నారు.
అనంతపురం: చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి పరిటాల సునీత చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతపురం రూరల్ మండలంలోని పాపంపేట దీక్ష శిబిరం వద్దకు వెళ్లిన పోలీసులు బలవంతంగా పరిటాల సునీతను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో సునీత-పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఖాకీల తీరుపై ఆమె మండిపడ్డారు. తీవ్ర ఉద్రిక్తతల నుడుమ సునీతను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్సకు ఆమె నిరాకరిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-26T11:19:23+05:30