బిపర్‌జోయ్ తుఫాను..గుజరాత్‌కు ఆరెంజ్ అలర్ట్..

ABN, First Publish Date - 2023-06-13T10:32:18+05:30 IST

అహ్మదాబాద్‌: అత్యంత తీవ్రంగా మారిన పెను తుపాను బిపర్‌జోయ్ ఈ నెల 15న గుజరాత్‌లోని సౌరాష్ట్ర కచ్ ప్రాంతాల్లో తీరం దాటవచ్చునని వాతావరణశాఖ హెచ్చరించింది.

అహ్మదాబాద్‌: అత్యంత తీవ్రంగా మారిన పెను తుపాను బిపర్‌జోయ్ ఈ నెల 15న గుజరాత్‌లోని సౌరాష్ట్ర కచ్ ప్రాంతాల్లో తీరం దాటవచ్చునని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ రెండు తీరాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. సౌరాష్ట్ర కచ్ జఖౌ పోర్టుకు సమీపంలోని పాకస్తానీ తీరం నుంచి ఈ తుపాను తీరం దాటవచ్చునని తెలిపింది. తూర్పు మధ్య అరేబియన్ సముద్రం, దాని పక్కనే ఉన్న ఈశాన్య అరేబియన్ సముద్రంలో దేవభూమి ద్వారకకు దక్షిణ నైరుతి దిశలో 380 కి.మీ. వద్ద తుపాను కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-13T10:32:18+05:30